@AbhinavaKavi - Kannamma | కన్నమ్మ | (Official Music Video) | Tautogram | Spoken Word | Telugu Rap

Your video will begin in 10
Skip ad (5)
directory, add your ads, ads

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by
100 Views
Kannamma track is a linguistic revolution. Crafted in the rare tautogram style, every word starts with the same letter, creating a hypnotic, rhythmic flow.

కలల కావలి కన్నమ్మ..
కవికి కావాలి కన్నమ్మ..!

From the very first spark of inspiration to the final note in the studio, "Kannamma" carries a universe of emotions. Every feeling poured straight from the heart, through the pen, onto paper. Now, it’s time for you to experience this ocean of emotions - straight from my heart, through the mic, to you.!

A heartfelt love letter for this Valentine’s.
Written & Performed by 'AbhinavaKavi' Pranav Chaganty
Shot & Edited by Blackbird Creations
Music , Mix & Master by Mr. BeatLust

Lyrics:
కత్తెర కన్నుల కన్నమ్మ, కిన్నెరసానిరా కన్నమ్మ
కన్నీటిధారలో కారుతున్న కవి కలల కావలి కన్నమ్మ
కవికి కావాలి కన్నమ్మ, కవిని కాపాడాలి కన్నమ్మ!
కళలో కనబడుతూ కవిలో కలసిపోవాలి కన్నమ్మ!
కిలకిలమంటే కన్నమ్మ, కుళ్ళుకోదా కోకిలమ్మ!
కౌగిలించుకుంటే కుక్కపిల్లలా కూడా కదలనా కన్నమ్మ! కన్నమ్మ,
కవినొదలని కలమా? కలమొదిలిన కావ్యమా?
కలలని కదిపి, కళగా కదిలే కలల కాగితమా?
కష్టం!
కన్నమ్మ కన్నుల కథకళితో కవి కళ్ళకి కునుకు కష్టం!
కాదు కాదు కాదు!
కులుకులొలుకు కన్నమ్మ కన్నుల కథకళిలో,
కవి కళ్ళకి కునుకులతో కలహమై,
కునుకు కరువై, కనుమరుగై, కలకలమై కన్నమ్మా,
కంటిలో కునుకులేక క్షణక్షణం కుములుతున్నా,
కవిలో కళవై కలలని కాపాడినావే!
కలవాలనుకున్నా కళ కలవనీయదాయే!
కనుమూసేలోగా కౌగిలించుకోరాదే!
కాలాన్నే కప్పేసే కౌగిలది! కొండల్నే కరిగించే కౌగిలది
కన్నమ్మ కౌగిలి కడలది! కడలది!
కనువిప్పు కలిగించే కనికట్టది! కనికట్టది!
కాష్టంలా కాలిపోతాదే! కమ్ముకున్న కీడన్నదే!
కలికి కన్నమ్మ కిలకిలలే, కవికి కమ్మని కీర్తనలే!
కళ్ళుమూసుకుంటే కన్నమ్మ,
కవి కలలిక కాళరాత్రులయ్యే!
కాటుకెట్టుకుంటే కన్నమ్మ, కలలిక కలహంసలయ్యే!
కలల కావలి కన్నమ్మ! కవికి కావాలి కన్నమ్మ!
కనుమరుగయ్యేలోగా కవిని కాపాడాలి కన్నమ్మ!
కనుమరుగయ్యేలోగా కవిని కాపాడాలి కన్నమ్మ!
కాపాడాలి కన్నమ్మ! కవిని కాపాడాలి కన్నమ్మ!


#నరనరానతెలుగుభాష #నాభాషేనాపొగరు #SwanSena
Category
Music Spoken Word Music Category S
Tags
pranav chaganty, telugu rap, abhinavakavi

Post your comment

Comments

Be the first to comment