arachethilo chekkabadina silpama//MUSIC track Telugu Christian gospel songs Lyrics ????discription

Your video will begin in 10
Skip ad (5)
Turn 1h of work a week into $2000 a month

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by
12 Views
#telugu #teluguquotes #telugusayings #christianmusic #jesus

Full song Link ????https://youtu.be/8am-XZm0ODA?si=973PU4v0bBKTjO-9

*పల్లవి:*
అరచేతిలోనే చెక్కబడినా ఓ శిల్పమా..
ఈ సృష్టిలోనే ప్రధమఫలమా..
ఊహలకు అందని అపురూప నిర్మాణమా..
ఆ దేవదేవుని స్వరూపమా..
ఈ నేలమంటితో..నిర్మించినాడుగా..తన ఊపిరే నీకిచ్చాడుగా..
తన రూపమందునా..సృజియించినాడుగా..నీ కోసమే ఎదురు చూసాడుగా..
ఆ దేవుని సంకల్పమే నువ్ గుర్తించావా..?
బ్రతుకిచ్చిన ఆ దేవునే నువ్ వదిలేస్తావా..?
యోచించుమా..ఓ నేస్తమా..పని ఉందని మరువకుమా..*||2||*

*చరణం 1:*
గర్భమున రూపించి..దేహన్ని నిర్మించి..
సమయాన్ని నీకిచ్చి..పనియిచ్చెను..
దినములను లెక్కించి..గ్రంధములో లిఖియించి..
సత్క్రియలు జరిగింప..నియమించెను..*||2||*
పాపమే ఘోరమై..ఆశకే చేరువై..
సత్యమే భారమై..దైవమే దూరమై..
ఊపిరే వదిలితే గతి ఏమిటో..నీ..బ్రతుకునే దిద్దుకో..జీవాన్ని పొందుకో..
*||అరచేతిలోనే||*

*చరణం 2:*
చీకటికి చోటిచ్చి..దుష్క్రియలు జరిగించి..
లోకాన్ని స్నేహించి..ప్రభుమార్గమిడిచావు..
ప్రభు నిన్ను ప్రేమించి..రక్తాన్ని చిందించి..
క్రయధనముగా మారి..విడిపించెను..*||2||*
ప్రార్థనే ఊపిరై..వాక్యమే జీవమై..
రక్షణే ధ్యేయమై..ప్రేమయే ప్రాణమై..
వెలుగుము జ్యోతిగా..వెలిగించు లోకాన్నే..
క్రీస్తుకే సాక్షిగా..సాగించు జీవనం..
*||అరచేతిలోనే||*

*FINAL WORDS:*
ప్రస్తుత కాలంలో యౌవనస్థులెందరో,జీవితం విలువ తెలియక బ్రతుకును ఛిద్రం చేసుకుంటున్నారు..
జీవిత పరమార్థం ఎరుగక కన్న తండ్రికి బాధను మిగులుస్తున్నారు..
అలాంటి వారికి కనువిప్పు కలిగించడమే మా ఈ ప్రయత్నం
దేవుని సంకల్పాన్ని గుర్తించండి,ప్రభు సాక్షిగా జీవనాన్ని సాగించండి..
Category
Music Bollywood/Tollywood Music Category B
Tags
entertainment, telugu christian, jesus

Post your comment

Comments

Be the first to comment